News September 10, 2025
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: డిఐఈఓ

మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య సూచించారు. బుధవారం గోపాల్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మంచి స్నేహానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఈమేరకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
Similar News
News December 5, 2025
ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్‌కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
News December 5, 2025
కామారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి దశ ఏకగ్రీవ సర్పంచి, ఉప సర్పంచి, వార్డులతో పాటు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై వచ్చిన 7 ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల పారదర్శకత, నిబంధనల అమలుకు సమయానుసార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 5, 2025
వృద్ధులు, దివ్యాంగుల కోటా పెంచలేం: TTD ఈవో

ఆన్‌లైన్‌లో రూ.300 దర్శన టికెట్లను తగ్గించి.. వృద్ధులు, వికలాంగులకు ఎక్కువ కేటాయిస్తే బాగుంటుందని చెన్నైకి చెందిన శ్రీనివాస్ డయల్ యువర్ TTD ఈవోలో కోరారు. వృద్ధుల కోటాను పెంచుతూ పోతే క్యూలైన్ల నిర్వహణ కష్టతరమవుతుందని ఈవో సింఘాల్ చెప్పారు. అన్నప్రసాద కేంద్రంలో వృద్ధులతో వెళ్లినప్పుడు వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంటోందని హైదరాబాద్‌కు చెందిన సువర్ణ కోరగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈవో చెప్పారు.


