News August 7, 2024

మాదక ద్రవ్యాలను ఏ రూపంలో ఉన్నా నియంత్రించాలి: కలెక్టర్

image

అసిఫాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాలను ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలిసి నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగంతో పాటు ఇతర సంబంధిత శాఖలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Similar News

News December 13, 2025

ఆదిలాబాద్: ‘బెదిరింపులకు పాల్పడితే చెప్పండి’

image

తినే పదార్థాలు తయారు చేసే యజమానులు ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత రంగులు వాడకూడదని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సురక్షిత ఆహారం, ఆరోగ్యంపై అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వస్తువులను వినియోగదారులు పరిశీలించి కొనాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమను సంప్రదించాలన్నారు. అధ్యక్షుడు దినేష్ ఉన్నారు.

News December 12, 2025

8 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికలు ఈ నెల 14న ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ గ్రామీణం, మావల, బేలా, జైనథ్, సాత్నాల, భోరాజ్, తాంసీ, భీంపూర్ మండలాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలన్నారు. మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు.

News December 12, 2025

మొదటి విడతలో ఎన్నికల్లో 15 కేసులు: ADB SP

image

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలో 15 కేసులు నమోదైనట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఉట్నూర్, నార్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లలో మొత్తం 50 మంది వ్యక్తులపై 15 కేసులు నమోదు చేశామన్నారు. రెండు రోజుల్లో 15 నిబంధనల ఉల్లంఘన కేసులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన 5 బృందాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.