News August 23, 2024
మానవ అక్రమ రవాణాలో శ్రీకాకుళం జిల్లా వాసి అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగాల ఆశతో యువతను టార్గేట్ చేసి బ్యాంకాక్, కాంబోడియా, మయన్మార్ దేశాల్లో కంపేనీలకు భారతీయులను అప్పగిస్తూ మోసం చేస్తున్న శ్రీకాకుళంకు చెందిన ఎ.రిశిరాజ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కేరళకు చెందిన ఏజెంటు ద్వారా చైనా సంబంధిత స్కామ్ జాబ్ కంపెనీల్లో చేర్పించి మోసగించాడన్నారు. 15న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఇమిగ్రేషన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News January 12, 2026
SKLM: విద్యుత్ సమస్యలపై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై AP విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి27వరకు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం SE నాగిరెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విచారణలు హైబ్రిడ్ విధానంలో యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందన్నారు. టెక్కలి పలాస డివిజన్ కార్యాలయాల నుంచి పాల్గొనవచ్చన్నారు.
News January 12, 2026
శ్రీకాకుళం: నాలుగు సార్లు MLA.. రెండు సార్లు మంత్రి!

జిల్లాలో ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందిన గుండ అప్పల సూర్యనారాయణ తన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకమైన ముద్ర వేశారు. 1985లో TDP నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. అప్పటి నుంచి 2004 వరకూ వరుసగా 4 సార్లు శ్రీకాకుళం MLAగా గెలుపొందుతూ వచ్చారు. 1987లో కరువు శాఖ మంత్రిగా, 1989లో బీసీ, ఎస్సీ, సాంఘిక సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు.
News January 12, 2026
పలాసలో భయపెట్టిస్తున్న గన్ కల్చర్

పలాసలో మరోసారి గన్ కల్చర్‌తో అలజడి రేగింది. ఈనెల 9న పలాస రైల్వే టూ వీలర్ పార్కింగ్ స్థల టెండర్ విషయంలో గన్, కత్తులతో కొందరు బెదిరింపులకు పాల్పడగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 NOVలో ఓ టీడీపీ నేత హత్యకు గన్స్‌తో వచ్చిన సుపారీ గ్యాంగ్ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలు 1978-80ల నాటి క్రైమ్‌ను ప్రజలకు గుర్తు తెస్తున్నాయి. అప్పట్లోనూ నాటు తుపాకులు, కత్తులతో దాడులు చేసి ముగ్గురిని హతమార్చారు.


