News November 19, 2025
మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News January 16, 2026
బ్యాన్ ఉన్నా.. ప్రాణాలు తీస్తోంది

భారత్‌లో 2017లోనే చైనా మాంజా వినియోగం, తయారీపై NGT బ్యాన్ విధించింది. అయినా ఏటా సంక్రాంతి వేళ దేశంలో పదుల సంఖ్యలో <<18869437>>ప్రాణాలు<<>> తీస్తోంది. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా దేశంలోకి వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అధిక ధరలకు విక్రయించొచ్చని ఢిల్లీ, హరియాణాలో ఎక్కువగా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇకనైనా కేంద్రం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
News January 16, 2026
పాల్వంచ: కొత్త అల్లుడికి ‘271’ వంటకాలతో విందు

కొత్త అల్లుడిపై అత్తమామలు తమ మమకారాన్ని వినూత్నంగా చాటుకున్నారు. సంక్రాంతి సందర్భంగా పాల్వంచలోని హైస్కూల్ రోడ్డుకు చెందిన గర్రె శ్రీనివాసరావు-పారిజాతం దంపతులు తమ అల్లుడు దత్త రామకృష్ణ, కుమార్తె ప్రణీతలకు ఏకంగా 271 రకాల పిండి వంటలు, స్వీట్లతో భారీ విందు ఏర్పాటు చేశారు. ఆంధ్ర సంప్రదాయాన్ని తలపించేలా తెలంగాణలోనూ ఇంత పెద్ద ఎత్తున వంటకాలు సిద్ధం చేయడంతో ఈ విందు స్థానికంగా చర్చనీయాంశమైంది.
News January 16, 2026
కాకినాడ: ‘కుక్కుట శాస్త్రం’ చెప్పిందే నిజమవుతోందా?

జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందేల్లో ‘కుక్కుట శాస్త్రం'(కోడి పురాణం) కీలకంగా మారింది. ఏ సమయంలో ఏ రంగు కోడి గెలుస్తుందో శాస్త్రంలో చెప్పినట్లే ఫలితాలు వస్తుండటంతో పందెంరాయుళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ఇష్టారాజ్యంగా పందేలు కాస్తున్నా, భారీగా బెట్టింగులు కట్టే వారు మాత్రం నక్షత్ర బలం, తిథి చూసుకొని బరిలోకి దిగుతున్నారు. దీనికి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ పెరిగింది.


