News November 19, 2025
మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News January 23, 2026
మోదీకి మద్దతు ఎందుకు: YS షర్మిల

AP: రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయడంలోనూ, అమరావతికి రాజధాని హోదా కల్పించడంలోనూ మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. VB-G RAM G బిల్లులోని 60:40 విధానం వలన ఏపీపై భారం పడుతుందంటూనే మరోవైపు సాయం కోరడంపై ఆగ్రహించారు. తొలుత బిల్లుకు ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. మోదీకి చంద్రబాబు మద్దతు కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
News January 23, 2026
భూభారతి సమస్యలు వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత భూభారతి ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. భూ రికార్డుల అప్‌డేట్స్, మార్పిడి, యాజమాన్య వివరాల ఎంట్రీ వేగవంతం చేయాలని సూచించారు. స్లాట్ బుకింగ్ ద్వారా సేవలు పారదర్శకంగా అందించాలని, మండల స్థాయిలో పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల భూ వివరాలు ఖచ్చితంగా నమోదు చేసి, సిస్టమ్ లోపాలను వెంటనే నివేదించాలని తెలిపారు.
News January 23, 2026
మేడారం జాతరకు కేంద్రం నిధులు విడుదల

TG: మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న వేడుకల్లో వసతుల కోసం అధికారులు వీటిని ఖర్చు చేయనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘గిరిజన సర్క్యూట్ పేరిట’ రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.


