News November 19, 2025

మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

image

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News

News January 20, 2026

కాకినాడ కలెక్టర్‌కి అవార్డు

image

కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్‌ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ‘ఉత్తమ అధికారి’ అవార్డుకు ఎంపిక చేసింది. 2003, 2005 ఎన్నికల జాబితాలను సరిపోల్చే ప్రక్రియలో ఆయన అసాధారణమైన టేబుల్ వర్క్ పూర్తి చేసినందుకు ఈ గౌరవం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా అధికారుల పనితీరును పరిశీలించిన సీఈవో, ఆయనను విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం ముస్సోరీలో ఉన్న కలెక్టర్‌కు జిల్లా అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

News January 20, 2026

SRPT: మతోన్మాద బీజేపీని ఓడించాలి: మల్లు నాగార్జున రెడ్డి

image

మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సీపీఎం పోటీ చేస్తుందని, లౌకిక పార్టీలతో కలిసి ముందుకెళ్తామన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టాలని అన్నారు.

News January 20, 2026

టెన్త్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్‌ను MAR 16-APR 1 వరకు నిర్వహిస్తామని SSC బోర్డు 2025 NOVలో వెల్లడించింది. MAR 20న ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని పేర్కొంది. అయితే ఆ రోజు రంజాన్ కావడంతో GOVT సెలవు ప్రకటించింది. దీంతో పరీక్షను MAR 21న జరిపే ఛాన్స్ ఉంది. కాగా కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ‘Way2News’కి తెలిపారు.