News February 17, 2025
మామడ: 25 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం

మామడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1999-20 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఒక్కచోట కలిశారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారందరూ కలిసి ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
Similar News
News April 20, 2026
SKLM: అత్త చితికి తలకొరివి పెట్టిన కోడలు

సరుబుజ్జిలిలోని షలంత్రి గ్రామంలో అత్త చితికి కోడలు తలకొరివి పెట్టిన ఘటన ఆదివారం జరిగింది. బత్తిని ఎర్రమ్మ (75) భర్త, ఇద్దరు కుమారులుండగా వారు ఇటీవల మృతి చెందారు. దీంతో ఎర్రమ్మ కోడలు కళావతితో నివాసం ఉండేది. కొంతకాలంగా ఎర్రమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఆదివారం ఆమె మృతి చెందగా కుమారులెవరూ లేకపోవడంతో కోడలు కళావతి అంత్యక్రియలు చేశారు.
News April 20, 2026
తూ.గో: అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

రాజమండ్రి సమీపంలోని గామన్ వంతెనపై ఆదివారం అర్ధరాత్రి బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో కొవ్వూరు(M) తెనకనమెట్టకు చెందిన కోడి లక్ష్మీగణపతి(32)తో పాటు ఎదురుగా బైకుపై వస్తున్న మరో గుర్తుతెలియని యువకుడు(27) ఉన్నారు. లక్ష్మీగణపతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2026
NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.


