News November 19, 2025

మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

image

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

Similar News

News January 20, 2026

స్టార్ హోటళ్లు-రిసార్టులతో విశాఖకు కొత్త మెరుపు

image

విశాఖలో రూ.1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సుమారు 1500 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఐటిసీ రూ.328 కోట్ల పెట్టుబడులతో హోటల్ ప్రాజెక్టును చేపడుతోంది. అలాగే అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీప ప్రాంతంలో Oberoi Hotels & Resorts,7-స్టార్ లగ్జరీ రిసార్ట్ & హోటల్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు కూడా హోటల్ నిర్మిస్తోంది.

News January 20, 2026

రిపబ్లిక్ డే వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

రిపబ్లిక్ డే వేడుక‌లకు ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాలని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌, ఏర్పాట్ల‌పై విశాఖ క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో సోమ‌వారం స‌మావేశం నిర్వహించారు. జ‌న‌వ‌రి 26న పోలీస్ ప‌రేడ్ మైదానంలో వేడుక‌లకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌తిబింబిస్తూ శ‌క‌టాల‌ను తీర్చిదిద్దాల‌ని, స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు.