News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.
Similar News
News January 24, 2026
విశాఖలో 392 మందికి నియామక పత్రాల అందజేత

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్‌గార్ మేళా ప్రవేశపెట్టిందని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ మేళా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన రోజ్‌గార్ మేళాలో మంత్రి పాల్గొని 392 మందికి నియామక పత్రాలు అందజేశారు.
News January 24, 2026
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డు.. రూ.23 వేల కోట్ల ఆదాయం

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23,000 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్ని కేవలం 294 రోజుల్లోనే సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 రోజులు ముందే కావడం విశేషం. మొత్తం ఆదాయంలో 11.21%, సరుకు రవాణాలో 11.31% వృద్ధిని నమోదు చేస్తూ, భారతీయ రైల్వేలోనే నంబర్ వన్ జోన్‌గా నిలిచింది. ఈ వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారికంగా వెల్లడించింది.
News January 24, 2026
విశాఖ సీపీ కార్యాలయంలో రికవరీ మేళా

విశాఖ సీపీ కార్యాలయంలో శనివారం రికవరీ మేళా నిర్వహించారు. డిసెంబర్ నెలలో మొత్తం 77 కేసులలో 44 కేసులు చేధించి 42 మంది దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం రూ.1,07,17,800 స్వాధీనం చేసుకొని వాటి యజమానులకు అందించారు. ఇందులో 294.155 గ్రాముల బంగారం, 301.58 గ్రాముల వెండి, రూ.1,72,500, 15 మోటార్ సైకిల్లు, ఒక ఆటో, 340 మొబైల్ ఫోన్స్, 12 ఆటో బ్యాటరీలు, ఒక బస్సు, 2 మెట్రిక్ టన్నుల కోల్ ఉన్నాయి.


