News November 7, 2024

మామునూర్: రైతులతో మంత్రి కొండా సురేఖ సమావేశం 

image

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు గురువారం మామునూర్ ఎయిర్ పోర్ట్ స్థల పరిశీలన చేశారు. అనంతరం మామునూర్ పరిసర ప్రాంతాలైన గుంటూరుపల్లి, గాడిపల్లి, నక్కలపల్లి రైతులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 11, 2024

గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లాలో గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రూప్-2 పరీక్ష నిర్వహణ, బయోమెట్రిక్ విధానంపై కలెక్టర్ అవగాహన సదస్సును నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షకు జిల్లాలో 16 కేంద్రాల్లో 5471 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

News December 11, 2024

నర్సింహులపేట: కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని యువతి సూసైడ్

image

కొత్త బట్టలు కొనివ్వలేదని యువతి సూసైడ్ చేసుకుంది. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాలు.. నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన నాగన్నబోయిన మనీషా(22) బాబాయ్ కుమార్తె వివాహానికి తనకు కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఈ నెల 6న పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

News December 10, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.15,800 పలకగా.. మంగళవారం రూ.15,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి గత సోమవారం రూ.14,000 పలకగా నేడు రూ. 13,500కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్నటిలాగే రూ.14,000 ధర వచ్చింది.