News November 19, 2025
మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు..!

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. క్షణికావేశంలో కన్నపేగు బంధాన్నే తెంచుకుంటున్నారు. ఇటీవల కోరుట్లకు చెందిన మహిళ ఈర్ష్యతో సొంత మరిది బిడ్డను గొంతు నులిమి చంపిన ఘటన మరువకముందే KNR వావిలాలపల్లిలో కన్నకూతురినే గొంతు నులిమి కడతేర్చిన తండ్రి, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకు ఘటనలు వెలుగుచూశాయి. డబ్బుల కోసం వేధిస్తున్న భర్తను హత్య చేసిన ఘటన JGTL(D) మల్లాపూర్ మం. దామ్రాజ్పల్లిలో ఆదివారం జరిగింది.
Similar News
News January 21, 2026
నేడు లలితా వ్రతం ఆచరిస్తే సకల సంపదలు

నేడు మాఘ శుద్ధ తదియ. ఈరోజు ‘లలితా వ్రతం’ ఆచరించడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు. లలితా దేవిని షోడశోపచారాలతో పూజించి, ఎర్రటి పుష్పాలు, కుంకుమతో అర్చన చేస్తారు. వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం, కన్యలు ఉత్తమమైన వరుడు లభించాలని ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠతో చేస్తారు. శక్తి స్వరూపిణి అయిన లలితా పరాభట్టారికను ధ్యానిస్తూ లలితా సహస్రనామ పారాయణ చేస్తే పాపాలన్నీ తొలగి, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
News January 21, 2026
ASF: నిరుద్యోగుల కోసం మినీ జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న జిల్లా కేంద్రంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి ఏ.రవికృష్ణ తెలిపారు. జంకాపూర్‌లోని పాత కలెక్టరేట్ కార్యాలయంలో గల టాస్క్ (TASK) శిక్షణ కేంద్రంలో ఈ మేళా జరుగుతుంది. ఆసక్తి గల యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9392310323, 7989733511, 9160608476 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
News January 21, 2026
టోల్ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్

హైవేలపై టోల్ చెల్లింపుల విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. టోల్ ఫీ పెండింగ్ ఉన్న వాహనాలకు ఇకపై వెహికల్ ఓనర్‌షిప్‌కు అవసరమైన NOC, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్, నేషనల్ పర్మిట్ లభించదని స్పష్టం చేసింది. చాలా సందర్భాల్లో వాహనదారులకు తెలియకుండానే బకాయిలు ఏర్పడే అవకాశముంది. టోల్‌ప్లాజా వద్ద టెక్నికల్ సమస్యల వల్ల మనీ కట్ అవ్వకపోవడం కూడా టోల్ ఫీ పెండింగ్‌గా చూపించే అవకాశముంది.


