News July 7, 2024

మార్కాపురం: ‘నకిలీ సర్టిఫికెట్లు ఏరి పారేయాలి’

image

నకిలీ సదరం సర్టిఫికెట్లను ఏరిపారేయాలని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి వంద మందిలో 25% నకిలీ వ్యక్తులే దివ్యాంగులుగా చలామణి అవుతూ నిజమైన దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగులకు న్యాయం చేసి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 17, 2025

టంగుటూరు వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

టంగుటూరులోని టోల్ ప్లాజాకు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. టోల్ ప్లాజాకు సమీపంలోకి బైక్ రాగానే, అటువైపుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి రహదారిపై బలంగా పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

News December 17, 2025

గిద్దలూరు: దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో లారీ ప్రమాదం..

image

గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం ఎస్‌–టర్నింగ్ వద్ద లారీ ప్రమాదం జరిగింది. మార్కాపురం నుంచి బళ్లారి వెళ్తున్న పత్తి లోడ్ మినీ లారీ అదుపుతప్పి కింద పడింది. డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.

News December 17, 2025

ఒంగోలులో ట్రాఫిక్ పోలీస్ వినూత్న ప్రచారం

image

ఒంగోలులో ట్రాఫిక్ సీఐ జగదీశ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం సాయంత్రం హెల్మెట్ ధారణపై వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధారణపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులోని బస్టాండ్ సమీపంలో హెల్మెట్ ధారణ పాటించిన బైకర్స్‌కు చాక్‌లెట్లు అందించారు. పలువురికి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు.