News December 2, 2025
మార్గశిరం: ఈ పేరు వెనుక కారణం

మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో సంచరిస్తాడు. అందుకే దీనికి ‘మృగశిర’ పేరిట ‘మార్గశిరం’ అనే పేరొచ్చింది. పురాణాల ప్రకారం దీనికో కథ కూడా ఉంది. భగవద్గీతలోని విభూతి యోగంలో శ్రీకృష్ణుడు ఈ నెల గురించి ‘అన్ని మాసాలలో నుంచి నేను మార్గశిర మాసాన్ని’ అని ప్రకటించుకున్నారు. అందుకే ఈ మార్గశిరాన్ని ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా, పవిత్రమైనదిగా, శుభకార్యాలకు శ్రేష్ఠమైనదిగా పరిగణిస్తారు.
Similar News
News February 18, 2026
టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) 24 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech/MCA, MBA, BSc/BCom/BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.tcil.net.in
News February 18, 2026
భూ రిజిస్ట్రేషన్ల అక్రమార్కుల్ని వదిలిపెట్టం: పొంగులేటి

TG: ధరణి పోర్టల్‌లోని వ్యవస్థీకృత లోపాల వల్లనే రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహా సహా ఇతర అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘గత పాలకుల కాలంలో అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల లాగిన్ డిలీట్ చేశారు. వారి స్వార్థానికి చేసిన లోపాలతో రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహాకు దారితీసింది. వారినెవరినీ వదిలిపెట్టం. కోడ్ ఆడిట్‌కు ఆదేశించాం. భవిష్యత్తులో లోపాలకు తావుండరాదు’ అని పేర్కొన్నారు.
News February 18, 2026
నమీబియాపై ఘన విజయం.. సూపర్-8కి పాక్

T20WC: నమీబియాపై పాకిస్థాన్ 102 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ సూపర్-8కి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 199/3 రన్స్ చేసింది. ఓపెనర్ ఫర్హాన్ సెంచరీ (58 బంతుల్లో 100)తో రాణించారు. అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. కాగా సూపర్-8లో పాకిస్థాన్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకలతో తలపడనుంది.


