News March 7, 2025
మార్చిలోనే భగభగలు.. బండి ఆత్మకూరులో 39.5°C

నంద్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గురువారం బండి ఆత్మకూరులో అత్యధికంగా 39.5°C ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడిమికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వేడితో పాటు ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో మధ్యాహ్నం జిల్లాలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
Similar News
News December 17, 2025
SRD: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి.. ఉప సర్పంచ్

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. స్వగ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు సర్పంచ్ కావాలనుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. అయితే రిజర్వేషన్ అనుకూలించక పోవడంతో తన అనుచరుడు అనిల్ కుమార్‌ను ఎన్నికల్లో నిలబెట్టి సర్పంచ్‌గా గెలిపించుకున్నాడు. తాను 11 వార్డ్ మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచిగా ఎన్నికయ్యాడు.
News December 17, 2025
8,113పోస్టులు.. CBAT షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది విడుదల చేసిన 8,113 <
News December 17, 2025
1147 22A భూ సమస్యలను పరిష్కరించాం: నాదెండ్ల

ఏలూరు జిల్లాలో వ్యాప్తంగా 22A భూ సమస్యల దరఖాస్తులు 1199 అందగా, వాటిలో 1147 దరఖాస్తులను పరిష్కరించామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మనోహర్ మంగళవారం తెలిపారు.142. 04 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించామన్నారు. మరో 32 ఎకరాలకు సంబంధించి 11 కేసులు పెండింగ్ ఉన్నాయని, వాటిలో 8 కేసులను వారంలోగా, 2 కేసులు 2 వారంలోగా పరిష్కారానికి చర్యలు, దేవాదాయ శాఖ సంబంధించిన ఒక కేసును నెలరోజుల్లోగా పరిష్కరించాలన్నారు.


