News March 23, 2024

మార్చి 25న కోటప్పకొండ గిరి ప్రదక్షిణ

image

మార్చి 25 తేది సోమవారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం 5 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ సేవాసమితి అధ్యక్షులు అనుమోలు వెంకటచౌదరి మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఘాట్ రోడ్డు వద్ద విజయ గణపతి దేవాలయం వద్ద అల్పాహారం, మార్గమధ్యంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News April 18, 2026

చిన్నారి పునర్విక చికిత్సపై TDP స్పష్టత

image

అరుదైన SMA టైప్-1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్లు స్వయంగా అందించిన విషయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీడీపీ Xలో ట్వీట్ చేసింది. మొత్తం రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం దాతలు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగతా మొత్తాన్ని లోకేశ్ భరించారని రాసుకొచ్చింది. CMRF నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని Xలో ఖండించింది.

News April 18, 2026

GNT: ఎండలు బాబోయ్.. ఉక్కబోతతో జనం ఉక్కిరి బిక్కిరి

image

గుంటూరు జిల్లాలో ఎండ‌లు మండిపోతున్నాయి. రోజు రోజుకీ సూర్య‌ప్ర‌తాపం పెరిగిపోతూ రికార్డు స్ధాయి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. వారం రోజులుగా ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉంటోంది. శనివారం 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఎండ‌ల ధాటికి ప్రజలు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు రావడానికే భయపడి పోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్నాయి.

News April 18, 2026

GNT: CRDA గ్రీవెన్స్ డే మార్పు

image

రాజధాని అమరావతి రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడి APCRDA కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే ఇకపై ప్రతి సోమవారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కమిషనర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. గతంలో శనివారం నిర్వహించగా మార్పు చేశారు. రాయపూడి CRDAలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్ వద్ద రోజువారీగా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.