News November 19, 2025

మార్నింగ్ ఫాగ్: నగరంలో హెల్మెట్, జాకెట్ ఇక పక్కా

image

శీతాకాలం తీవ్రత నేపథ్యంలో నేరేడ్మెట్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండటంతో రహదారులపై విజిబిలిటీ తగ్గి ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. వాహనదారులు లో-బీమ్ లైట్లు ఉపయోగించడం, సురక్షిత దూరం పాటించడం, ఓవర్‌టేక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బైకర్లు హెల్మెట్, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని హెచ్చరించారు.

Similar News

News January 23, 2026

HNK: పరీక్ష హాల్‌లో సెల్‌ఫోన్.. ఆన్సర్ షీట్ వైరల్!

image

ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ లోపం హనుమకొండ జిల్లాలో బట్టబయలైంది. SR ప్రైమ్ కళాశాలలో జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షా కేంద్రంలోకి ఓ విద్యార్థి నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా జవాబు పత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగాల్సిన పరీక్షల్లో ఫోన్ లోపలికి ఎలా వచ్చిందో?

News January 23, 2026

V2V కోసం 30 GHz కేటాయించిన కేంద్రం

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల ప్రకటించిన <<18808386>>V2V టెక్నాలజీ<<>> కోసం 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఇంటర్నెట్‌ అవసరం లేకుండా నేరుగా భద్రతా సమాచారాన్ని పంచుకుంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఒక్కో వాహనానికి రూ.5,000-7,000 ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

News January 23, 2026

ఇషాన్ కిషన్ ఊచకోత.. రికార్డ్ బ్రేక్

image

రెండో టీ20లో భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదారు. దీంతో NZపై అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచారు. తొలి టీ20లో అభిషేక్ 22 బాల్స్‌లో ఈ ఫీట్ సాధించగా ఇషాన్ దాన్ని బద్దలుకొట్టారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో ఫిఫ్టీ చేశారు.