News November 19, 2025
మార్నింగ్ ఫాగ్: నగరంలో హెల్మెట్, జాకెట్ ఇక పక్కా

శీతాకాలం తీవ్రత నేపథ్యంలో నేరేడ్మెట్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండటంతో రహదారులపై విజిబిలిటీ తగ్గి ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. వాహనదారులు లో-బీమ్ లైట్లు ఉపయోగించడం, సురక్షిత దూరం పాటించడం, ఓవర్‌టేక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బైకర్లు హెల్మెట్, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని హెచ్చరించారు.
Similar News
News January 13, 2026
చలాన్లపై సీఎం రేవంత్‌ది చెత్త సలహా: బండి

TG: చలాన్ల విషయంలో 50% డిస్కౌంట్ ఇస్తామన్న CM రేవంత్ <<18838769>>మాట<<>> మార్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రక్షణకి ప్రాధాన్యమిస్తూ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయని అయితే చలాన్లు ఆటో డెబిట్ చేయాలనడం చెత్త సలహా అని మండిపడ్డారు. ఒకవేళ ఇదే కొనసాగిస్తామంటే ముందుగా మంత్రులు/నేతల బ్యాంక్ అకౌంట్లు లింక్ చేయాలన్నారు. PM మోదీ జన్ ధన్ అకౌంట్లు తీసుకొస్తే, కాంగ్రెస్ ప్రజల డబ్బులు లూటీ చేయాలని చూస్తోందన్నారు.
News January 13, 2026
PSLV-C62 విఫలం.. ఆ 16 ఉపగ్రహాల పరిస్థితేంటి?

PSLV-C62 ప్రయోగం విఫలం కావడంతో అందులోని 16 ఉపగ్రహాల పరిస్థితేంటనే సందేహం వ్యక్తమవుతోంది. కక్ష్యలోకి చేరడానికి కావాల్సిన వేగం అందకపోవటంతో అవి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని ఇస్రో మాజీ ఇంజినీర్ ఒకరు వివరించారు. గాలితో రాపిడి వల్ల మంటలంటుకొని కాలి బూడిదైపోతాయని తెలిపారు. చిన్న శకలాలేమైనా మిగిలుంటే అవి సముద్రంలో పడిపోతాయన్నారు. సోమవారం సాయంత్రానికే ఇదంతా జరిగిపోయి ఉంటుందని వెల్లడించారు.
News January 13, 2026
ప్రాక్టికల్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అన్ని సౌకర్యాలతో కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్ష గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు 21,150 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.


