News August 22, 2025
మాల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా మహేశ్

మంగపేట మండలం మల్లూరు హేమాచల క్షేత్రం నూతన ఈవోగా మహేశ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఈవో సత్యనారాయణ హన్మకొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఈవోగా బదిలీ అయ్యారు. కాగా, భూపాలపల్లిలోని భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్న మహేశ్ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News January 17, 2026
మద్దిలపాలెంలో బస్సు కింద పడి వ్యక్తి మృతి

విశాఖలోని మద్దిలపాలెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, స్కూటీ ఒకే దిశలో వెళ్తుండగా, స్కూటీ అదుపుతప్పి పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి బస్సు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు.
News January 17, 2026
పిల్లల్లో ఆటిజం ఉందా?

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.
News January 17, 2026
కేసీఆర్ నాకు శత్రువు కాదు: రేవంత్

TG: తనకెవరూ శత్రువులు లేరని, శత్రువు అనుకున్న వ్యక్తిని 2023లో బండకేసి కొట్టానని పాలమూరు సభలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ‘ఆయన నడుము విరిగి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే నేనెందుకు శత్రువు అనుకుంటా. ఆయన లేచి సరిగ్గా నిలబడ్డప్పుడు మాట్లాడతా. మహిళలకు అన్యాయం చేసేవాళ్లు, విద్యార్థులకు నష్టం కలిగించేవాళ్లు, చదువుకోకుండా ఊరిమీద పడి తిరిగేవాళ్లు, పేదరికమే నా అసలైన శత్రువులు’ అని వ్యాఖ్యానించారు.


