News November 19, 2025
మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య ఎక్కడ..?

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్, చీఫ్ తిప్పిరి తిరుపతి అంగరక్షకుల అరెస్ట్ నేపథ్యంలో ములుగు(D) చెందిన కొయ్యడ సాంబయ్య @ఆజాద్ ఎక్కడ..? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈనెల 14న ఆయనతో పాటు గోదావరిఖనికి చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లొంగిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు పోలీసు వర్గాలు వారి అరెస్ట్ /లొంగుబాటును నిర్ధారించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News January 24, 2026
కొత్తగూడెం: రేపు ‘ఫిట్ ఇండియా సైకిలింగ్ డే’

జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కొత్తగూడెంలో ఘనంగా జరపనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. రేపు నూతన ఓటర్లతో ‘ఫిట్ ఇండియా సైకిలింగ్ డే’ జరుపుతామని అన్నారు. ఉదయం 6 గంటలకు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి లక్ష్మీదేవిపల్లి రామచంద్ర డిగ్రీ, పీజీ కాలేజ్ వరకు సైక్లిస్ట్‌లతో ర్యాలీ ఉంటుందని చెప్పారు. మీడియా మిత్రులు పాల్గొనాలని కోరారు.
News January 24, 2026
మద్దూరులో యువకుడి ఆత్మహత్య

మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లిలో భీమేశ్ (19) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం పొలానికి వెళ్లే దారిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.
News January 24, 2026
రథ సప్తమి పూజ ఎలా చేయాలంటే..?

రథసప్తమి నాడు సూర్యరశ్మి పడే చోట ఆవు పేడతో శుద్ధి చేయాలి. పిడకల పొయ్యి పెట్టాలి. ఇత్తడి పాత్రలో ఆవు పాలను పొంగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం చేయాలి. దాన్ని చిక్కుడాకుల్లో సూర్యుడికి నివేదించాలి. అనంతరం అందరికీ వితరణ చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే చిక్కుడు కాయలు, కొబ్బరి పుల్లలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజించాలి. పాలు పొంగడం ఇంటి అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు.


