News March 30, 2024
మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం

భద్రాచలం: మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం రేపాయి. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు కన్నాయిగూడెం వద్ద శనివారం నడిరోడ్డుపై మావోయిస్టులు కరపత్రాలు లభ్యమయ్యాయి. ఈ కరపత్రాల్లో ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే విధంగా దేశ, విదేశీ బహుళజాతి కార్పొరేట్ కంపెనీల మైనింగ్స్, ప్లాంట్లు, రోడ్లు, డ్యాంలు, టైగర్ జోన్‌లు, అభయారణ్యాలు వంటి ప్రాజెక్టులను నిలిపి వేయాలని ఆ పత్రాలలో పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
ఖమ్మం: పందిళ్లపల్లికి 1,334 టన్నుల యూరియా

చింతకాని మండలంలోని పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు మంగళవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 1,334.97 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. టెక్నికల్ ఏవో పవన్ కుమార్ పర్యవేక్షణలో ఈ నిల్వలను ఖమ్మం (634 టన్నులు), భద్రాద్రి కొత్తగూడెం (200), మహబూబాబాద్ (400) జిల్లాలకు కేటాయించారు. సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
News February 11, 2026
నేడు ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు

KMM జిల్లాలో 5 మున్సిపాలిటీల పరిధిలో 116వార్డుల్లో ఎన్నిక జరగనుంది. ఈ మేరకు 414మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,41,875 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో మహిళలు 74,083 మంది, పురుషులు 67,768 మందితో పాటు ఇతరులు 24 మంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో మంగళవారం సాయంత్రానికి కేటాయించిన కేంద్రాలకు చేరారు.
News February 10, 2026
ఖమ్మం: విద్యుత్ శాఖలో మహిళా రక్షణకు కమిటీ

ఖమ్మం: పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నివారణకు(POSH చట్టం) ఖమ్మం విద్యుత్ సర్కిల్‌లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్ఈ శ్రీనివాసాచారి మహిళా ఉద్యోగులతో సమావేశమై, ఛైర్‌పర్సన్ రజని కుమారి నేతృత్వంలోని కమిటీ వివరాలను వెల్లడించారు. వేధింపులపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తామని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని భరోసా ఇచ్చారు. సురక్షిత పని వాతావరణమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


