News September 12, 2025

మావోయిస్టు మృతితో మడికొండలో విషాద ఛాయలు..!

image

హనుమకొండ జిల్లా మడికొండలో మావోయిస్టు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. మడికొండ వాస్తవ్యుడైన కేంద్ర కమిటీ సభ్యుడు (CCM), సెంట్రల్ రీజినల్ బ్యూరో మెంబర్ (CRBM), ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ(60) అలియాస్ బాలన్న అలియాస్ భాస్కర్ అలియాస్ మనోజ్ అలియాస్ రాజేష్ అలియాస్ రామచందర్ అలియాస్ రాజేంద్ర మరణించినట్టుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు.

Similar News

News December 16, 2025

NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్‌కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.

News December 16, 2025

GNT: మృతదేహాల తరలింపులోనూ వసూళ్ల దందా.!

image

ఎంతో ఘన చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మృతదేహాన్ని ఉచితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన మహాప్రస్థానం వాహన డ్రైవర్లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలను కూడా బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.

News December 16, 2025

బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

image

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.