News August 12, 2025

మిట్టల్ సంస్థపై ఎందుకంత మోజు?: విశ్రాంత ఐఏఎస్

image

నక్కపల్లి: ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం నక్కపల్లి మండలంలో వేలాది ఎకరాల భూములను సేకరించి జీవవైవిద్యాన్ని ధ్వంసం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మిట్టల్ సంస్థపై ప్రభుత్వానికి ఎందుకంత మోజు చూపిస్తుందని ప్రశ్నించారు.

Similar News

News March 16, 2026

NZB: ఫీజులు లక్షల్లో.. భోజనం నరకప్రాయం

image

ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు భోజనం విషయంలో నాణ్యత పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. మెనూ ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ అందించకుండా, ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం తిండితో అనారోగ్యం పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

News March 16, 2026

HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

image

నగరంలో వీకెండ్‌ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.

News March 16, 2026

కడప: పదో తరగతి ఎగ్జాం రూములోకి పాము

image

కడప జిల్లా బి.కోడూరులో పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న ఓ పరీక్షా కేంద్రంలోని రూములోకి పాము వచ్చింది. విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్కూల్ సిబ్బంది పామును చంపి బయట వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లారు.