News August 21, 2025

మిడ్ మానేరులో కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

image

బోయినపల్లి మండలం మన్వాడ వద్దగల శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీటితో పాటు, మూలవాగు, మానేరు ద్వారా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 17,152 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 13,802, గాయత్రి పంప్ హౌస్ నుంచి 3,150, మూలవాగు, మానేరు వాగు ద్వారా 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Similar News

News January 23, 2026

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సిద్ధమవ్వండి: జేసీ ఆదేశం

image

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులతో గూగుల్ మీట్ ద్వారా మాట్లాడిన ఆయన.. ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న పాస్ పుస్తకాల పంపిణీకి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రీ-సర్వే అంశాలనూ వేగవంతం చేయాలన్నారు.

News January 23, 2026

డీఆర్ఓ అవినీతి బండారం బహిర్గతం

image

పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ మెరుపు దాడులు కలకలం రేపాయి. క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన డీఆర్వో మురళి అవినీతి బయటపడింది. రూ.26 లక్షల బిల్లులకు గాను రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా మురళి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. ఫైళ్లను అడ్డుపెట్టడం, బిల్లుల మంజూరులో జాప్యం చేసి డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

News January 23, 2026

బాపట్ల జిల్లాలో మరో ప్రమాదం.. నుజ్జనుజ్జైన మహిళ తల

image

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన భట్టిప్రోలులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శివయ్య వివరాల మేరకు.. భట్టిప్రోలు బస్టాండ్ సెంటర్‌లో అదే గ్రామానికి చెందిన రాజకుమారి(37) భర్త శ్రీనుతో నడచి వెళ్తుండగా చెరుకుపల్లి నుంచి వస్తున్న లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజకుమారి తల నుజ్జునుజ్జైంది. ఆమె భర్త శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.