News April 19, 2024
మిథున్ రెడ్డి ఆస్తులు రూ.147 కోట్లు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎన్నికల ఆఫిడవిట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.147 కోట్లుగా చూపించారు. అప్పులు రూ.54 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి వాహనాలు లేవని స్పష్టం చేశారు. తనకు 100 గ్రాములు, భార్య వద్ద 1.286 కేజీల బంగారం ఉన్నట్లు ప్రకటించారు..
Similar News
News September 14, 2024
కడప: ‘17 నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు’
అక్టోబర్ 2న ‘స్వచ్ఛ భారత్ దివస్’ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈనెల 17 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవా’ పేరుతో, కార్యక్రమాలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మండలాల అధికారులతో వీసీ ద్వారా శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జిల్లా “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
News September 13, 2024
కడప: 108 వాహనాల్లో ఉద్యోగ అవకాశాలు
108 వాహనాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండి BS-3, 4, 6 (టెంపో ట్రావెలర్, టాటా వింగర్)లను చేయగలిగే వారు ఈ ఉద్యోగాలకు అర్హులను వారు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4లోపు దరఖాస్తులు కడప న్యూ రిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్న 108 కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News September 13, 2024
గృహ నిర్మాణాలలో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్
అన్నమయ్య జిల్లాలో గత రెండు వారాలుగా గృహ నిర్మాణాలలో జీరో శాతం స్టేజ్ కన్వర్షన్ ఉన్నవారు వారంలోగా ప్రగతి సాధించాలన్నారు. లక్ష్యసాధనలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి డివిజన్, మండల స్థాయి గృహ నిర్మాణ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.