News April 19, 2024

మిరపకాయ్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం KCR: పొంగులేటి

image

వరంగల్ మిరపకాయ్ సంగతీ మీకు తెలుసు కేసీఆర్.. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ రేవంత్ రెడ్డి పెడతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబుబాబాద్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో బలరాం నాయక్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్‌కు చిప్పకూడు తినే రోజులు తోందరలోనే వస్తాయన్నారు.

Similar News

News September 8, 2024

స్వల్పంగా తగ్గుతున్న మున్నేరు వాగు

image

ఖమ్మం నగరంలో ప్రవహిస్తున్న మున్నేరు వాగు స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం మధ్యాహ్ననానికి 13.50 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 13.75 అడుగుల వద్ద ఉన్న మున్నేరు వరద రెండు గంటలకు 13.50 అడుగులకు పడిపోయింది. స్వల్పంగా తగ్గుతుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

News September 8, 2024

వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి

image

ప్రకృతి వైపరిత్యాలు వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలన్నారు. ఆదివారం ఖమ్మం ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద రూ.1,300 కోట్లు పంపిందని, వరదపై రాజకీయం చేయడం సరికాదన్నారు.

News September 8, 2024

ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి

image

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు, రోగులకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.