News November 19, 2025

మిర్యాలగూడ: ఒంటరి మహిళను మోసం చేసిన కానిస్టేబుల్

image

పెళ్లి పేరుతో ఒంటరి మహిళను వంచించిన పోలీస్ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. మఠంపల్లికి చెందిన వివాహిత, ఒంటరి మహిళను వాడపల్లిలో పనిచేసే కానిస్టేబుల్ నాగరాజు పెళ్లి పేరుతో లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో మహిళ గర్భం దాల్చింది. అబార్షన్ కూడా చేయించాడు. ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించి దాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ 1 టౌన్ CI తెలిపారు.

Similar News

News January 19, 2026

సంక్రాంతి ముగిసింది.. రొటీన్ లైఫ్ మొదలైంది

image

సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టమైనా సరే పల్లెలు విడిచి తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితంలోకి అడుగు పెట్టేశారు. బాస్ మెప్పు కోసం తిప్పలు, కెరీర్ వెనుక పరుగులు, నైట్ షిఫ్టులతో కుస్తీలు పడాల్సిందే. ఈ ఏడాది సొంతూరులో గడిపిన క్షణాలు, అమ్మానాన్న ఆప్యాయతలు, అయినవాళ్ల పలకరింపులను మనసులో దాచుకుని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు వాటినే నెమరువేసుకోవాలి!

News January 19, 2026

NZB: సంక్రాంతి ఎఫెక్ట్.. రూ. 27.89 కోట్ల మద్యం విక్రయం

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పండుగ సందర్భంగా రూ. 27.89 కోట్ల మద్యం అమ్ముడుపోయిందని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 151 వైన్స్‌లు, 29 బార్ల యజమానులు పండుగను పురస్కరించుకుని ఈ నెల 12 నుంచి మాక్లూర్ మండలంలోని IML డిపో నుంచి మద్యం స్టాక్ కొనుగోలు చేశారు. ఈ మేరకు ఈ నెల 12న రూ. 7.62 కోట్లు, 13న రూ. 4.82 కోట్లు, 14న రూ.6.87 కోట్లు, 16న రూ. 8.08 కోట్ల మద్యాన్ని కొన్నారు.

News January 19, 2026

24% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు

image

భారత్ నుంచి 2025లో ఆటోమొబైల్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2024లో 50,98,474 వాహనాల ఎగుమతి జరగ్గా.. గతేడాది ఆ సంఖ్య 63,25,211(24.1%)కు చేరింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతి 16%, యుటిలిటీ వెహికల్స్ 32శాతం, కార్ల ఎగుమతులు 3% మేర పెరిగాయి. వీటిలో 3.95 లక్షల యూనిట్లు ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది.