News March 10, 2025

మిర్యాలగూడ: కోర్టు తీర్పు.. పేరెంట్స్, అమృత భావోద్వేగం

image

మిర్యాలగూడ <<15710555>>ప్రణయ్ హత్య<<>> కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. కాగా తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. కాగా ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు.

Similar News

News January 17, 2026

NLG: మేయర్ పీఠం సహా 9 పురపాలికలు మహిళలకే

image

ఉమ్మడి జిల్లాలో మేయర్ పీఠంతో పాటు 9 పురపాలికల ఛైర్‌పర్సన్ స్థానాలు మహిళలకే దక్కాయి. ఎస్సీలకు రెండు, బీసీలకు 3, జనరల్ 7, జనరల్ మహిళలకు 7 స్థానాలకు రిజర్వు చేశారు. బీసీలకు రిజర్వు చేసిన మూడింటిలో ఒక్కటి మాత్రమే జనరల్ కాగా రెండు మున్సిపాలిటీలు మహిళలకే రిజర్వు చేయడం విశేషం.

News January 17, 2026

చిత్తూరు: వేంకన్నా.. రైతుల కష్టాలు వినవన్నా.!

image

<<18883864>>బకాయిల<<>> చెల్లింపులో మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. గతేడాది ఉమ్మడి చిత్తూరు(D)లో రైతుల నుంచి దాదాపు 2.33 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరించారు. KGకి ప్రభుత్వం రూ.4, కంపెనీలు రూ.8 చెల్లించేలా GOVT నిర్ణయం తీసుకుంది. చిత్తూరు-30, తిరుపతి జిల్లాలో 8 ఫ్యాక్టరీలు పంటను కొనుగోలు చేసి 8 నెలలు అవుతున్నా ఇంత వరకు బకాయిలు చెల్లించలేదట.

News January 17, 2026

చిత్తూరు: రైతులకు రూ.400 కోట్ల బకాయిలు.?

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38 పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. చిత్తూరులో 4 కంపెనీలు మాత్రమే రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు జమ చేశాయట. తిరుపతిలో ఒక్క పరిశ్రమ కూడా నగదు జమ చేయలేదు. మరికొన్ని 40 శాతం మందికి చెల్లింపులు చేయగా, 10-14 పరిశ్రమలు ఇప్పటి వరకు రూ.1కూడా ఇవ్వలేదట. ఇంకొన్ని సంస్థలు టన్నుకు రూ.8 వేలకు బదులు రూ.3-4 వేలు జమ చేశాయట. దాదాపు రూ.300-400 కోట్ల వరకు కంపెనీలు రైతులకు బకాయిలు ఉన్నాయి.