News December 1, 2025
మిర్యాలగూడ: ‘నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే రెఫరెండం కోరతా’

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం సర్పంచ్ అభ్యర్థి అందుగుల నాగమ్మ ఎన్నికల్లో వినూత్న ప్రచారం చేపట్టారు. సర్పంచ్‌గా గెలిపిస్తే ఐదేళ్ల పదవీకాలంలో రెండుసార్లు రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) కోరతానని ఆమె ప్రకటించారు. పరిపాలన బాగా లేకపోతే రాజీనామా చేస్తానని, ఇందుకు ఓటర్లు సిద్ధంగా ఉండాలని కోరుతూ ఆదివారం నామినేషన్ వేసి, అనంతరం తన హామీలకు కట్టుబడి ఉంటానని కరపత్రాలు పంపిణీ చేశారు.
Similar News
News February 13, 2026
తిరుపతి SVU విద్యార్థులకు గమనిక

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) 63-68 వార్షిక కాన్వకేషన్స్ (Convocations) దరఖాస్తులకు గడువు పొడిగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ (CE) రాజమాణిక్యం పేర్కొన్నారు. 2025 విద్యా సంవత్సరంలోపు డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులు మార్చి 10వ తేదీ కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News February 13, 2026
సంచలనం.. ఓటుకు రూ.70,000?

TG: రంగారెడ్డి(D) మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు ఎన్నిక సంచలనంగా మారింది. కౌన్సిలర్ పదవి కోసం పోటీ చేసిన ఓ అభ్యర్థి ఓటుకు ₹70K, 25KGల బియ్యం, 15 లీటర్ల వంట నూనె, పట్టుచీర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ₹7Cr ఖర్చు చేశారని టాక్. అదే వార్డులో మరో అభ్యర్థి కూడా ఓటుకు ₹40K పంచినట్లు స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీలో రియల్ ఎస్టేట్ ఊపులో ఉండటంతోనే పదవికి పోటీ ఏర్పడిందంటున్నారు.
News February 13, 2026
నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.


