News September 11, 2025

మిల్స్‌కాలనీ పరిధిలో పట్టుబడిన పేకాటరాయుళ్లు

image

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. తెల్లవారుజామున మిల్స్ కాలనీ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడిని నిర్వహించారు. ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్టు చేయగా, మరొకరు తప్పించుకున్నారని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. నిందితుల నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు, తదుపరి విచారణ కోసం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Similar News

News December 10, 2025

కరీంనగర్: ఎన్నికల కోసం పోలీస్ సిబ్బంది కేటాయింపు

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 782 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 40 మంది SIలు, 34మంది హెడ్ కానిస్టేబుల్స్, 392మంది కానిస్టేబుళ్ళు, 47మంది స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 144 హోంగార్డ్స్, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులని ఆయన తెలిపారు. పోలింగ్ బందోబస్తు చేసే పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.

News December 10, 2025

విజయవాడ: 18 లడ్డూ విక్రయ కేంద్రాల ఏర్పాటు

image

విజయవాడ అమ్మవారి దర్శనార్థం విచ్చేయు దీక్షా దారులకు కోసం 34.50 లక్షల లడ్డులను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ప్రసాద భవనంతో పాటు నూతన ప్రసాద తయారీ భవనం, శృంగేరి షెడ్డులో నిరంతరంగా లడ్డు తయారీ జరుగుతోంది. ప్రసాద విక్రయానికి మొత్తం 18 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొండపై 1, రైల్వే స్టేషన్ వద్ద 1, బస్టాండ్ వద్ద 1, ఇతర ప్రాంతాల్లో 4 కౌంటర్లు అందుబాటులో ఉంటాయి.

News December 10, 2025

జిల్లా అభివృద్ధిలో రహదారుల నిర్మాణం కీలకం: కలెక్టర్

image

జాతీయ రహదారుల నిర్మాణం బాగుంటే బాపట్ల జిల్లా అభివృద్ధి పట్టాలపై పయనిస్తుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై కలెక్టర్ బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. అన్నిప్రాంతాలకు రవాణా సౌకర్యం, రహదారులు మెరుగ్గా ఉంటే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీ, సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా పాల్గొన్నారు.