News April 24, 2024
మిసెస్ ఇండియా 2024 ఫస్ట్ రన్నరప్‌గా HYDకి చెందిన సాఫ్ట్ వేర్

హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రుతీ చక్రవర్తి రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన కాంటెస్ట్‌లో మరో 20 మంది కంటెస్టెంట్స్‌తో పోటీపడిన శృతీ చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
Similar News
News December 17, 2025
హైదరాబాద్‌లో BJPకి అగ్ని పరీక్ష!

GHMC ఎన్నికల రణరంగంలో BJP ఉనికి ఇప్పుడు ఒక అగ్నిపరీక్షగా మారింది. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతూ ప్రజా సమస్యలను విస్మరించడం పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. నాయకత్వ లేమి, అగ్ర నేతల వర్గపోరు క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను నిర్వీర్యం చేశాయి. 300 కొత్త వార్డుల పునర్విభజన అనే వ్యూహాత్మక చక్రబంధాన్ని ఎదుర్కోవడంలో BJP వెనుకబడింది. తక్షణమే ప్రజా సమస్యలపై పోరాటమే కమలానికి ఏకైక మార్గం.
News December 17, 2025
HYDలో తగ్గిన ఎయిర్ క్వాలిటీ.. జాగ్రత్త!

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంటోంది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT
News December 17, 2025
HYD: దమ్ బిర్యానీ పక్కదారి!

వైరల్ రీచ్ కోసం యువ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అసలైన ‘దమ్ బిర్యానీ’ రుచిని పక్కన పెట్టి కేవలం ఫొటోలకు పనికొచ్చే ఫ్యాన్సీ ప్లేటింగ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాత తరపు ఘాటైన రుచికి, కొత్త తరఫు ఇన్‌స్టా-కేఫ్‌ల మెరుపులకు మధ్య యుద్ధమే నడుస్తోంది. ఏది ‘రుచి రాజసం’? ఏది ‘లైకుల మోసం’? అని బిర్యానీ లవర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ‘బిర్యానీ దమ్’ చచ్చిందా? ‘రీల్స్ ట్రెండ్’ గెలిచిందా? కామెంట్ చేయండి.


