News May 7, 2025
మీరు కనపడని పోలీసులు: తిరుపతి SP

తాము కనపడే పోలీసులైతే.. తిరుమల ట్యాక్సీ డ్రైవర్లు కనపడని పోలీసులని SP హర్షవర్ధన్ రాజు కొనియాడారు. 400మంది టాక్సీ డ్రైవర్లతో తిరుమల ఆస్థాన మండపంలో సమావేశమయ్యారు. ‘భక్తులతో మీరు మర్యాదగా ప్రవర్తిస్తే మీ పేరు అన్ని చోట్లా మారుమోగుతుంది. ఎవరైనా తిరుమలకు నిషేధిత వస్తువులు తెచ్చినా, నేరస్థులు, దొంగలు టాక్సిలో ఎక్కినా వెంటనే పోలీసులకు చెప్పాలి. పాసింజర్ల కోసం రోడ్డుపై గొడవలకు దిగకండి’ అని SP సూచించారు.
Similar News
News February 7, 2026
ఈ 3 దేశాల్లో ఇంటర్నెట్ ఉన్నా లేనట్టే!

EAలోని ఎరిట్రియా, N.కొరియా, CAలోని తుర్క్‌మెనిస్తాన్ దేశాల్లో ఇంటర్నెట్ లిమిటెడ్‌గా ఉంటుంది. భద్రతా కారణాలతో టెలికాంలపై ఎరిట్రియా, N.కొరియా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఎరిట్రియాలో ప్రభుత్వ పర్యవేక్షణలోని కెఫేలపై పౌరులు ఆధారపడతారు. నా.కొరియాలో SM వాడటంపై నిషేధం. తుర్క్‌మెనిస్తాన్‌లో SM, వార్తలు, ఫారిన్ సైట్స్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. VPNల సపోర్ట్‌తో వాడుతున్నా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
News February 7, 2026
HYD: ఆమోదాలు.. ఖజానా ఖాళీ చేసేందుకేనా?

GHMC పాలకమండలి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెల 10న పదవీకాలం ముగియనుండగా.. 9న స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. కొన్ని టేబుల్ అజెండాలను ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఒక్కరోజు ముందు ఆమోదించి ఏం అభివృద్ధి చేస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం టెండర్ల బిల్లులు చెల్లింపు పేరుతో ఖజానా ఖాళీ చేయడానికి కమిటీ సమావేశం అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
News February 7, 2026
జర్నలిస్టులు అక్రెడిటేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో 2026-28 సంవత్సరాలకు గాను జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని శనివారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల గడువు ఈనెల 28తో ముగియనుందని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం నూతన కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.


