News January 13, 2026
‘మీరు చనిపోయారా?’

ఇదేం ప్రశ్న అని ఆశ్చర్యపోకండి. చైనాలో ‘Are you dead’ అనే యాప్ ఇప్పుడు ట్రెండింగ్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్లు 2 రోజులకోసారి అందులోని బటన్ క్లిక్ చేయాలి. యూజర్ బతికే ఉన్నారనడానికి అదే గుర్తు. అలా చేయకపోతే యూజర్ ప్రమాదంలో ఉన్నారని ఎమర్జెన్సీ కాంటాక్టులకు మెసేజ్ వెళ్తుంది. ఒంటరి యువత ఎక్కువగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటోందట. చైనాలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్‌గా ఇది నిలిచింది.
Similar News
News February 14, 2026
కాగజ్‌నగర్‌లో ఓటర్ల విలక్షణ తీర్పు..!

కాగజ్‌నగర్ బల్దియా ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఇక్కడ పోటీ చేసిన 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కదానికి మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు ఇవ్వలేదు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 9, BRS 11, BJP 05, AI MIM 01, ఇండిపెండెంట్ లు 03 గెలిచారు.
News February 14, 2026
కొత్తగూడెం మేయర్ పదవిని కైవసం చేసుకుంటాం: సీపీఐ

TG: కొత్తగూడెంలో మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఇప్పటికే KTR కాల్ చేసి BRS తరఫున మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు. ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చ చేయలేదని పేర్కొన్నారు. మేయర్ పదవి గిరిజనులకే ఇస్తామని తెలిపారు. కాగా EC ప్రకారం ఇక్కడ CPI 22, CONG 22, BRS 8, ఇండిపెండెంట్లు 6 సీట్లు, BJP, CPM తలో చోట గెలిచాయి.
News February 14, 2026
ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం(ఫొటోలో)
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం


