News November 30, 2025
మీరు దోపిడీ చేసి.. మాపై ఆరోపణలా: బీజేపీ

కేంద్రం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ చేసిన <<18430142>>ఆరోపణలపై <<>>BJP మండిపడింది. ఈ కేసు 2008 నాటిదని, అప్పుడు కేంద్రంలో మోదీ లేరని చెప్పింది. ‘కేవలం ₹50 లక్షలతో నేషనల్ హెరాల్డ్‌ను యంగ్ ఇండియన్ కంపెనీకి బదిలీ చేశారు. అందులో 76% వాటా సోనియా, రాహుల్‌కు వెళ్లింది. ఇది స్పష్టమైన దోపిడీ. మీరు దోపిడీ చేసి యజమాని అవుతారు. మిమ్మల్ని ఇరికించారని మాపై ఆరోపణలు చేస్తారు’ అని BJP నేత రవి శంకర్ ప్రసాద్ ఫైరయ్యారు.
Similar News
News February 9, 2026
కిరాణాషాపులకు దెబ్బ?

ఇప్పటివరకు మెట్రో సిటీలకే పరిమితమైన క్విక్ కామర్స్ రంగం టైర్ 3/4 నగరాలకు వచ్చేసింది. ఇండియాలోని 200 నగరాల్లో బ్లింకిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాబోయే ఐదేళ్లలో భారీగా కిరాణా దుకాణాలు మూతపడే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 10 ని. డెలివరీ ప్రభావం కిరాణాషాపులపై అంతగా ఉండదని, మెట్రో సిటీల్లో ఇది చూశామని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ COMMENT?
News February 9, 2026
US సైనిక మోహరింపులకు భయపడం: ఇరాన్

అమెరికాతో <<19053726>>చర్చల్లో<<>> యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమను ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. <<19009250>>సైనిక మోహరింపు<<>>లతో అమెరికా తమను భయపెట్టలేదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ అన్నారు. ‘మాకు USపై పెద్దగా నమ్మకం లేదు. ఆ దేశంతో చర్చల గురించి మా వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు.
News February 9, 2026
గొర్రెలను కొంటున్నారా? మంద వేగంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

గొర్రెల పెంపకంలో ఆదాయం మంద అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. దీని కోసం రైతులు మంద నుంచే గొర్రెలను కొనాలి. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునేవి వద్దు. చూడి, మొదటిసారి ఈనిన వాటిని కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తన పొట్టేలు రెండేళ్ల లోపు వయసుండి, ఆరోగ్యంగా, చురుకుగా, కవల పిల్లలను కనే వంశం నుంచి వచ్చినదై ఉండాలి. గొర్రెల మంద పెరగడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.


