News November 30, 2025
మీ ఇంట్లో మీరు మొదటి సంతానమా?

ఏ ఇంట్లో అయినా పెద్ద అమ్మాయి/అబ్బాయికి చిన్నతనం నుంచే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. వారు తమ తోబుట్టువుల సమస్యలు పరిష్కరించడం, సహాయం చేయడంతో పాటు మెచ్యూర్‌గా ఉంటారు. సైకాలజీలో దీన్ని “పేరెంటిఫికేషన్” అంటారు. దీనివల్ల ఇండిపెండెంట్ నేచర్ పెరుగుతుంది. కానీ చిన్న వయసులోనే బాధ్యతల ఒత్తిడి వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమానమైన మద్దతు, ప్రేమ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News February 16, 2026
అటు బంగ్లా, ఇటు పాక్‌కు చెక్ పెట్టిన భారత్

తమ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి పౌరులకు భద్రత కల్పించిన భారత్‌లోనే రక్షణ లేదంటూ బంగ్లాదేశ్ అహంకారం ఒకవైపు. ‘మేం కూడా భారత్‌తో మ్యాచ్ ఆడం’ అంటూ చివరి వరకు నక్క తెలివితేటలు చూపిన పాకిస్థాన్ మరోవైపు. ఈ రెండు దేశాల తలపొగరును <<19153355>>తన ఆటతో<<>> దించేసింది టీమ్ ఇండియా. ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి ఫేమస్ డైలాగ్ మాదిరిగా చాలా పద్ధతిగా, సమష్టిగా దెబ్బకొట్టింది. ‘తగ్గేదేలే’ అంటూ భారత్ మరోసారి సత్తా చాటింది.
News February 16, 2026
TODAY HEADLINES

* T20WC: పాక్‌పై భారత్ ఘన విజయం
* జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ
* CECపై అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు
* ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో
* కోవా బన్ను వివాదం.. బాధితుడికి లోకేశ్ మద్దతు
* రైతులకు రూ.20వేలు ఎక్కడ: YCP
* మున్సిపల్ ఫలితాలు నా పనికి గీటురాయి: రేవంత్
* TG: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక
* TG: ఒకే విడతలో రైతుభరోసా.. 17న జమ!
News February 16, 2026
మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

TG: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు వీరి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హంగ్ ఏర్పడిన చోట ఏ ఒక్కటి చేజారనీయొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు పాల్గొన్నారు.


