News March 6, 2025
ముగిసిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ: ఎన్నికల రిటర్నింగ్ అధికారి

ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,52,029 ఓట్లు పోలైనట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 2,23,343 ఓట్లు చెల్లుబాటు అయ్యాయని, 28,686 ఓట్లు చెల్లుబాటు కాలేదని తెలిపారు.
Similar News
News December 7, 2025
ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు.. సీఎం నిర్ణయం

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్ వినూత్న ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను HYD ప్రధాన రోడ్లకు పెట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’, అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేర్లను పెట్టనున్నారు. అలాగే పలు కీలక రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను పరిశీలిస్తున్నారు.
News December 7, 2025
చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. సోమవారం రాత్రి 9.45 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి బుధవారం మ.2 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌కు, బుధవారం సా.4 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌లో బయలుదేరి గురువారం సాయంత్రం 6.30కు చర్లపల్లికి చేరుకుంటుందని పేర్కొన్నారు.
News December 7, 2025
మంచిర్యాల-పెద్దంపేట మధ్య రైలు కింద పడి వ్యక్తి మృతి

మంచిర్యాల-పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. మృతుని వయసు 40 నుంచి 45 ఏళ్లు ఉండగా.. టీ షర్ట్, నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ తరలించి జీఆర్పీ ఎస్ఐ మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు సమీపంలోని స్టేషన్లు సంప్రదించాలని సూచించారు.


