News March 20, 2025
ముడుమల్ నిలువురాళ్లకు దక్కిన గౌరవం

ముడుమల్ నిలువు రాళ్లు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ గ్రామంలో ఉన్నవి. ఇవి సుమారు 3500-4000 సంవత్సరాలనాటివి. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలో 10 నుంచి 14 అడుగుల ఎత్తు గల 80 పొడవైన మెన్‌హీర్‌లు(నిలువు రాళ్లు) ఉన్నాయి, స్థానికంగా ‘బంతి- రాళ్లు’ ‘నిలువు రాళ్లు’ అని పిలుస్తారు. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో ముడుమాల్ నిలువురాళ్లకు గౌరవం దక్కింది.
Similar News
News April 23, 2025
ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రణయ్

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సదాలి ప్రణయ్ సత్తా చాటాడు. ద్వితీయ సంవత్సరం MPC విభాగంలో 1000కి 991 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి సదాలి బాపన్న-గంగమ్మ దంపతుల కుమారుడు ప్రణయ్. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో యువకుడిని గ్రామస్థులు అభినందించారు.
News April 23, 2025
గార్ల మండలానికి చెందిన నిహారికకు రాష్ట్రస్థాయి ర్యాంక్

గార్ల మండలానికి చెందిన శీలం శెట్టి నిహారిక మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో 1000కి 988(బైపీసీ) మార్కులు సాధించిందని ఆమె తండ్రి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న నిహారిక.. చదువులో రాణించడంతో పలువురు అభినందనలు తెలిపారు. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.
News April 23, 2025
అదానీ స్పెక్ట్రమ్‌తో ఎయిర్‌టెల్ డీల్

అదానీ డేటా నెట్‌వర్క్స్ 26GHz బ్యాండ్‌లోని 400 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వాడుకునేందుకు ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.212 కోట్లు చెల్లించింది. గుజరాత్, ముంబై, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులోని స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ వినియోగించుకుంటుంది. దీనివల్ల 5G వేగం, నెట్‌వర్క్ కెపాసిటీ పెరగనుంది. యూజర్లకు నాణ్యమైన సేవలు అందుతాయి.