News February 10, 2025

ముత్తంగి అలంకారంలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో సోమవారం రామయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా స్వామి వారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన, కర్మఃపుణ్యాహవాచన చేసి స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ యోక్త్రధారణ తదితర కార్యక్రమాలతో రామయ్యకు నిత్యకళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.

Similar News

News February 14, 2026

వరంగల్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుళ్ల బదిలీలు

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లతో పాటు మొత్తం 59 మందిని ఇతర ప్రాంతాలకు మార్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన వారు తక్షణమే కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.

News February 14, 2026

మోదీపై నమ్మకంతో కరీంనగర్‌లో గెలిపించారు: బండి సంజయ్

image

TG: మోదీపై నమ్మకంతో ప్రజలు కరీంనగర్‌లో బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటర్లు గుణపాఠం చెప్పారని అన్నారు. జీహెచ్ఎంసీని ఒవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఆస్తుల మాదిరి పంచుకున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

News February 14, 2026

సింగరేణిలో డంప్‌మెన్ పోస్టులకు పరీక్ష

image

సింగరేణి రామగుండం-2 ఏరియాలో డంప్‌మెన్ (ట్రిప్‌మెన్) ఖాళీల భర్తీకి సెకార్-3 సింగరేణి స్కూల్‌లో అంతర్గత పరీక్ష నిర్వహించారు. 23 మందికి గానూ 21 మంది హాజరయ్యారు. ఎస్.ఓ టు జీఎం సంతోష్ కుమార్ ప్రశ్నపత్రాల సీలును తెరిచారు. ఐఈడీ డీజీఎం చంద్రశేఖర్, డీవైపీఎం వంశీధర్, ప్రిన్సిపల్ సుందర్ రాజు పాల్గొన్నారు. ఏఎస్ఓ షరీఫ్ మహ్మద్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.