News June 18, 2024
ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలి: పల్నాడు SP

ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు కావలసిన ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. మంగళవారం చిలకలూరిపేట టౌను, రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News January 24, 2026
అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన DGP

అమరావతి ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడ్డాక రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు ఆ ప్రాంతంలో ప్రాక్టీస్ పెరేడ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు, పార్కింగ్, ఇతర విషయాల గురించి స్థానిక అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
News January 24, 2026
GNT: సినీ సంగీత పితామహుడు బి.ఎన్.ఆర్ జయంతి

తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుల్లో ఆద్యులైన భీమవరపు నరసింహారావు జయంతి నేడు. గుంటూరు జిల్లా కొలకలూరులో 1905 జనవరి 24న ఆయన జన్మించారు. చిన్ననాడే సంగీతంపై మక్కువతో స్వయంగా హార్మోనియం నేర్చుకున్నారు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యారు. 1936లో ‘సతీ తులసి’ చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించి మాలపిల్ల, రైతుబిడ్డ, ద్రౌపదీ వస్త్రాపహరణం, అర్ధాంగి వంటి చిత్రాలకు సంగీతం అందించారు.
News January 24, 2026
తుళ్లూరు: వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు

ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధిలో భాగంగా ఏపీ సీఎం CBN పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు ప్రారంభించి వీధి వ్యాపారులకు అందజేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారులకు రూ. 206 కోట్ల రుణం పంపిణీ చేశారు. వీధి వ్యాపారును ఆర్థికంగా బలోపేతం చేయటమే ఈ పథకం ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో MEPMA డైరెక్టర్ వాకాటి కరుణ ఐఏఎస్ పాల్గొన్నారు.


