News April 4, 2024

మునగపాక: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ములబంద గోడీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన దాడి వెంకట అప్పారావు (57) పొలంలోని చెరకు క్రషింగ్ పూర్తి కావడంతో క్రషర్, బెల్లం పెనాన్ని బుధవారం సాయంత్రం తన కుమారుడు చందు, మరో రైతు ఆడారి చిన అప్పారావు సహాయంతో శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలో విద్యుత్ తీగకు పెనం తగిలింది. దీంతో ముగ్గురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రమాదంలో వెంకట అప్పారావు అక్కడికక్కడే మృతిచెందారు.

Similar News

News February 13, 2026

విశాఖ: రేపు పాఠశాలల సెలవు రద్దు

image

జిల్లాలో ఫిబ్రవరి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నెలకొన్న ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో ఒక రోజు సెలవు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.

News February 13, 2026

గంగవరం పోర్టులో కనీసం బ్రేక్ వాటర్ నిర్మించండి: ఎమ్మెల్యే పల్లా

image

గంగవరం పోర్టు ఏర్పడిన తర్వాత ఇక్కడ జెట్టీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జెట్టీ లేక ఇక్కడి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. కనీసం బ్రేక్ వాటర్‌ను అయినా నిర్మించి స్థానిక మత్స్యకారులను ఆదుకోవాలని ఆయన కోరారు.

News February 13, 2026

విశాఖ: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

విశాఖ జిల్లాలోని ఎంజేపీ ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి, 6-8 (బ్యాక్‌లాగ్), ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న 5వ తరగతికి, ఏప్రిల్ 19న మిగిలిన తరగతులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని గురుకులం ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోధి తెలిపారు. మరిన్ని వివరాలకు www.mjpapbcwreis.pacfss.inను సందర్శించాలన్నారు.