News September 9, 2025

మునిపల్లి: పాఠశాల స్థలాన్ని పరిశీలించిన మంత్రి

image

మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు హాస్టల్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడిన ఘటన ప్రదేశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహా పరిశీలించారు. ఘటనపై అధికారులతో మంత్రి చర్చించారు. హాస్టల్‌లోని మిగిలిన భవనాల స్టాండర్డ్స్‌ను పరిశీలించి ఉపయోగానికి, పనికిరాని వాటిని బ్లాక్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

Similar News

News December 13, 2025

పాలమూరు: అత్తాకోడళ్లలో పై చేయి ఎవరిది..!

image

నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి (కాంగ్రెస్), పాలమూరు ఎంపీ డీకే అరుణ (బీజేపీ)ల స్వగ్రామం ధన్వాడలో సర్పంచ్ ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. 8,327 ఓట్లు గల ఈ గ్రామంలో కాంగ్రెస్ నుంచి సి.జ్యోతి, బీజేపీ నుంచి పి.జ్యోతి బరిలో నిలిచారు. వీరితో పాటు బీఆర్‌ఎస్ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. అత్తాకోడళ్ల పార్టీల్లో ఎవరిది పై చేయి అనేది రేపు మధ్యాహ్నం తేలనుంది.

News December 13, 2025

2026లో ఉద్యోగాల జాతర.. RRB క్యాలెండర్ విడుదల

image

2026 ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు ఉండనున్నాయి.

News December 13, 2025

కస్టమ్స్‌ కమిషనర్ ఆఫీస్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కోచిలోని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ట్రేడ్స్‌మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: taxinformation.cbic.gov.in/