News September 9, 2025
మునిపల్లి: ‘ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలి’

మునిపల్లి మండలం లింగంపల్లి పాఠశాలలో గోడ కూలిన ప్రమాదంలో గాయాల పాలైన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వ ఉపాద్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతరాము అన్నారు. ఈ విషయంలో అధికారులు విచారణ జరిపి, త్వరగా పిల్లలకు నూతన డార్మెటరీని నిర్మాణం చేయాలని జీటీే సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేశారు.
Similar News
News December 12, 2025
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

AP: గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై నివేదిక అందించారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కర తేదీలను ప్రకటించింది. 2027 జులై 7వ తేదీవరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది.
News December 12, 2025
చిత్తూరు: 2.22 లక్షల మందికి పోలియో చుక్కలు

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఆర్వో మోహన్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో పల్స్ పోలియో సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.22 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరికి 142 రూట్లలో 5,794 బూత్‌ల పరిధిలో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
News December 12, 2025
తిరుపతి SVU ఫలితాల విడుదల

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది LLM1, 3 MSc బయో కెమిస్ట్రీ, MSc జియోలజీ, M.Com (FM / A&F) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు విడుదలయ్యాయి. www.results.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


