News February 9, 2025
ముమ్మిడివరం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ముమ్మిడివరం మండలం అన్నం పల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు..యానం నుంచి బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులు ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టారు.. పల్లంకూరుకు చెందిన బూల చింటూ (20) అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 11, 2026
బౌరపూర్ జాతరకు మంత్రి సీతక్క రాక

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని బౌరాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతరకు ఫిబ్రవరి 14 తేదీన రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణ రానున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే జాతర పూర్తిగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఉంటుందన్నారు. భక్తులు అడవిలోకి ప్లాస్టిక్ వస్తువులు, అధిక శబ్దాలు చేస్తూ అడవి జంతువులకు ఇబ్బంది కల్గించవద్దని సూచించారు.
News February 11, 2026
వేల్పూరు డంపింగ్ యార్డులో మృతదేహం కలకలం

తణుకు మండలం వేల్పూరు డంపింగ్ యార్డులో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, మృతదేహం మూడు రోజుల క్రితానిదిగా, పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉందని తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌ఛార్జ్ ఎస్ఐ జనా సతీష్ పేర్కొన్నారు.
News February 11, 2026
నల్గొండ: ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్: కలెక్టర్

కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను తనిఖీ చేస్తున్నారు. పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల, బోయవాడలోని మోడల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే 18004251442 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.


