News November 20, 2025

ములుగు: అంబేడ్కరా.. చలి నుంచి రక్షించు!

image

ములుగు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అటవీ ప్రాంతంలో చలి తీవ్రత పెరగడంతో మనుషులతో పాటు జంతువులు విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో ఏటూరునాగారంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు ఓ కోతుల గుంపు కూర్చొని చలికి వణుకుతోంది. ‘అంబేడ్కరా.. చలి నుంచి మమ్మల్ని కాపాడు’ అని విగ్రహం వద్ద కూర్చొని వేడుకున్నట్లు ఉన్న ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించారు.

Similar News

News January 19, 2026

రాణా బ్యాటింగ్ అద్భుతం: సునీల్ గవాస్కర్

image

న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో టీమ్‌ఇండియా బౌలర్ హర్షిత్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. షార్ట్ పిచ్ బాల్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. టీమ్ ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన రాణా చక్కటి ఇన్నింగ్స్ ఆడారని తెలిపారు. రాణా 43 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 రన్స్ చేశారు. 7వ వికెట్‌కు విరాట్‌తో కలిసి 99రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు.

News January 19, 2026

హుస్నాబాద్: అదుపుతప్పిన బైక్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

హుస్నాబాద్ మండలం పూల్నాయక్ తండాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బర్మావత్ మనోహర్(27) బైక్ అదుపుతప్పి కరెంటు పోల్‌ను ఢీకొని మృతిచెందాడు. సంక్రాంతి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన మనోహర్ హుస్నాబాద్-కరీంనగర్ మార్గంలో సబ్‌స్టేషన్ సమీపంలో సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. 108 సిబ్బంది ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

News January 19, 2026

సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్‌లో ర్యాలమడుగు ఉపాధ్యాయుడు

image

నిజాంపేట మండలం ర్యాలమడుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ సైన్స్ ప్రదర్శనలో తన ప్రతిభను చాటారు. తెలంగాణ ఉపాధ్యాయ విభాగంలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైన ఆయన కొల్లూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనలో ఇంటరాక్టివ్ మ్యాథ్స్ కార్నర్ ప్రదర్శించారు. గణితంలో వినూత్న బోధనలతో సత్తా చాటుతున్నారు. ఖేడ్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య, జైపాల్ రెడ్డి అభినందించారు.