News December 1, 2025

ములుగు: ఈసారి PLGA వారోత్సవాలు లేనట్లే!

image

ప్రతియేటా డిసెంబర్ 2 నుంచి నిర్వహించనున్న నక్సల్స్ పీఎల్‌జీఏ వారోత్సవాలు ఈ ఏడాది నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. మావోయిస్టుల లొంగుబాటు, మరోవైపు అగ్రనేతలు ఎన్కౌంటర్ల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరగాల్సిన సంస్మరణ వారోత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఇటీవల మావోయిస్టు నేత అనంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News February 10, 2026

మహాశివరాత్రి సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

image

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం పార్వతీపురంలోని తన కార్యాలయం నుంచి VC నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని తగిన బందోబస్తు ఏర్పాట్లు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల పట్ల తగు సూచనలు, కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సులభమైన, సురక్షితమైన దర్శనాన్ని కల్పించేలా క్యూ లైన్ల వద్ద బందోబస్త్ పెంచాలన్నారు.

News February 10, 2026

ANU: డీపీఈడీ, ఎంపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత డిసెంబర్‌లో జరిగిన మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఈనెల 19 తేదీలోగా అందించాలని సూచించారు. వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.

News February 10, 2026

దీనస్థితిలో ఉన్నానంటూ సీనియర్ నటుడి ఆవేదన

image

తాను దీనస్థితిలో ఉన్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ HC గతవారం తీహార్ జైలు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలుకెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో ‘కష్టాల్లో ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ వారిదే’ అని వాపోయారు. ‘అతా పతా లాపతా’ మూవీతో డైరెక్టర్‌గా మారేందుకు ఆయన ఓ వ్యాపారి వద్ద ₹5Cr అప్పుచేసి తిరిగివ్వలేదు.