News December 1, 2025
ములుగు: ఈసారి PLGA వారోత్సవాలు లేనట్లే!

ప్రతియేటా డిసెంబర్ 2 నుంచి నిర్వహించనున్న నక్సల్స్ పీఎల్‌జీఏ వారోత్సవాలు ఈ ఏడాది నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. మావోయిస్టుల లొంగుబాటు, మరోవైపు అగ్రనేతలు ఎన్కౌంటర్ల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరగాల్సిన సంస్మరణ వారోత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఇటీవల మావోయిస్టు నేత అనంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News February 9, 2026
ఓయూలో నేడు, రేపు తెలుగు సాహిత్య మహాసభ

ఓయూలో నేడు, రేపు 2వ తెలుగు మహాసభ- 2026 జరగనుంది. ఆర్ట్స్ కాలేజీ 133 తరగతి గదిలో జరిగే కార్యక్రమంలో యువ కవులు, రచయితలు, నవలాకారులు, విమర్శకులు, సినిమా రచయితలు పాల్గొననున్నట్లు నిర్వాహకులు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.కాశీం తెలిపారు. అలాగే ఆర్ట్స్ కాలేజీ ఎదుట సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు పేర్కొన్నారు.
News February 9, 2026
గొర్రెలను కొంటున్నారా? మంద వేగంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

గొర్రెల పెంపకంలో ఆదాయం మంద అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. దీని కోసం రైతులు మంద నుంచే గొర్రెలను కొనాలి. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునేవి వద్దు. చూడి, మొదటిసారి ఈనిన వాటిని కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తన పొట్టేలు రెండేళ్ల లోపు వయసుండి, ఆరోగ్యంగా, చురుకుగా, కవల పిల్లలను కనే వంశం నుంచి వచ్చినదై ఉండాలి. గొర్రెల మంద పెరగడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.
News February 9, 2026
జగిత్యాల: ఎస్సారెస్పీ కెనాల్‌లో మృతదేహం లభ్యం

జగిత్యాల (R) మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో మృతదేహం లభ్యమైంది. జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్‌కు చెందిన షేక్ నయీమ్ (43) గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. భార్యతో తరచూ గొడవలు జరగగా తల్లి వద్దనే ఉంటున్నాడు. ఈనెల 6న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన నయీమ్ తిరిగి రాకపోవడంతో జగిత్యాల రూరల్ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. ఆదివారం నయీం శవం లభ్యమైంది.


