News February 9, 2025
ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Similar News
News February 12, 2026
లైఫ్‌లో ఎన్నిసార్లు ప్రేమలో పడతారు..?

జీవితంలో ఒక మనిషి సగటున 2సార్లు గాఢంగా ప్రేమిస్తారని కిన్సీ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 18-99సం.ల మధ్య గల 10వేల మందిపై సర్వే చేయగా.. 14% అసలు పిచ్చి ప్రేమలో పడబోమని, 28% ఒకసారి, 30% రెండు సార్లు, 17% మూడుసార్లు, 11% 4లేదా అంతకంటే ఎక్కువ సార్లు లవ్‌లో మునిగి తేలుతామన్నారట. ప్రేమ, ఆకర్షణకు తేడా గుర్తించక ప్రతి ఫీలింగ్‌నూ లవ్ అనుకుని ఆ రిలేషన్ మొదట్లో పొరబడతారట. ఈ సర్వేలో మీది ఏ బ్యాచ్? కామెంట్.
News February 12, 2026
మా ప్రాజెక్టుల్ని AP ఎందుకు అడ్డుకుంటోంది: రేవంత్

TG: ‘పాలమూరు-రంగారెడ్డి’ని AP అడ్డుకోవడంపై CM రేవంత్ అసహనం వ్యక్తంచేశారు. ‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసుకోవచ్చని విభజన చట్టంలో ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ ఇష్టమొచ్చినట్లు మీరు చేస్తే మాకు నచ్చినట్లు మేమూ చేస్తాం. గోదావరి జలాల్లో మాకూ 960 TMCల వాటా ఉంది. బేసిన్ అవసరాలు తీరాకే ఇతర బేసిన్లకు నీటిని తరలించాలి. మిగులు జలాల్లో చెరిసగం వాడుకోవచ్చు. చర్చలతో సమస్య తీరుతుంది’ అని CM పేర్కొన్నారు.
News February 12, 2026
MBNR: రేపే కౌంటింగ్.. ఇవి నిషేధం: SP

పాలమూరు యూనివర్సిటీ (లెక్కింపు కేంద్రం) పరిసర ప్రాంతాల్లో BNSS 163 ప్రకారం నిషేధాజ్ఞలు (సెక్షన్ 144 అమలు) శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉ.6 గంటల వరకు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు ముప్పు కలిగించే ఏవైనా వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.


