News December 1, 2025

ములుగు: చల్పాక ఎన్‌కౌంటర్‌కు ఏడాది

image

ఏటూరునాగారంలోని చల్పాక అటవీ ప్రాంతంలో గత ఏడాది డిసెంబర్ 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ఘటన జరిగి నేటికీ సరిగ్గా ఏడాది. కాగా, ఎన్‌కౌంటర్‌కు కీలక నేత బద్రు, మల్లయ్య, దేవల్, జమున, కిషోర్, కామేష్‌తోపాటు మరో సభ్యుడు మృతి చెందారు. ఆ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News February 15, 2026

బందరు పోర్ట్, బుడమేరుకు మొండిచేయి..!

image

బందరు పోర్టు పనులకు గత ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించగా, పోర్టు పనులు 50 శాతం పూరైనా ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. బుడమేరు ప్రక్షాళనకు నిధులు వస్తాయని కూటమి నేతలు ఆశా భావం వ్యక్తం చేసినా చివరికి మొండిచేయే మిగిలింది. ఇక విజయవాడ, వైజాగ్ మెట్రో పనులకు కలిపి రూ. 15.50 కోట్లు కేటాయించారు. ఐతే ఇప్పటివరకు కేంద్రం నుంచి మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు రాలేదు.

News February 15, 2026

బంగ్లా ఎన్నికల్లో ఓ సీటు గెలిచిన ‘BJP’!

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BJP ఓ సీటు గెలుచుకుంది. మీరు చదివింది నిజమే. కాకపోతే అక్కడున్నది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ(BJP). భోలా-1 నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అందలీవె రహ్మాన్ పార్థో విజయం సాధించారు. దేశంలో 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP 209 సీట్లు <<19125261>>దక్కించుకోవడం<<>> తెలిసిందే. ఇక జమాత్ కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు <<19132575>>జులై ఛార్టర్‌<<>>కు అనుకూలంగా ఏకంగా 70 శాతం మంది ఓటు వేశారు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.