News August 14, 2025

ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు

image

జిల్లాలో నేటి నుంచి ఈ నెల 17 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపినట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి 21 వరకు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంత వాసులు పునరావాస కేంద్రాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్న తెలపాలని అధికారులను కోరారు.

Similar News

News March 14, 2026

జగిత్యాల : పదవ తరగతి పరీక్షలలో 11 మంది గైర్హాజరు

image

జగిత్యాల జిల్లాలో శనివారం జరిగిన పదవ తరగతి పరీక్షలలో 11 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాము తెలిపారు. 68 పరీక్ష కేంద్రాలలో 12684 మంది విద్యార్థులకు గాను 12673 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. 99.91 % హాజరు శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. సప్లిమెంటరీ విద్యార్థులు 12 మందికి గాను 12 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.

News March 14, 2026

నర్మెట్ట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రులు

image

సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గతంలో ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల రూ.300 కోట్ల నిధులతో పూర్తి చేయించారని తెలిపారు. ఈ పరిశ్రమ ఈ ప్రాంత రైతుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మంత్రులు పేర్కొన్నారు.

News March 14, 2026

గద్వాల: సోమవారం ప్రజావాణి రద్దు

image

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గద్వాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జనాభా గణన అంశంపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ శిక్షణా తరగతుల దృష్ట్యా సోమవారం ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.