News January 24, 2025

ములుగు జిల్లాలో గ్రామసభలు అట్టర్ ఫ్లాప్: బడే నాగజ్యోతి

image

ములుగు జిల్లాలో ప్రభుత్వం నాలుగు రోజులుగా నిర్వహించిన గ్రామసభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి అన్నారు. ప్రతి గ్రామసభ పోలీస్ పహారాలో కొనసాగిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజలపై కాంగ్రెస్ నాయకులు జులుం ప్రదర్శించారన్నారు. స్థానిక సంస్థల ఓట్ల కోసమే కాంగ్రెస్ గ్రామసభల హైడ్రామాకు తెరలేపిందన్నారు.

Similar News

News February 13, 2025

యూట్యూబర్‌ను అన్‌ఫాలో చేసిన కోహ్లీ, యూవీ

image

యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో క్రికెటర్లు విరాట్ కోహ్లీ, యువరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరు ఇప్పటివరకూ ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్‌వీర్‌ను ఫాలో అవుతుండగా తాజాగా అన్‌ఫాలో చేశారు. ఇలాంటి వ్యక్తులను ఫాలో అవ్వకపోవడమే కరెక్ట్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు. మరికొందరు సెలబ్రిటీలు కూడా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

News February 13, 2025

ఆసియాలో రిచెస్ట్ ఫ్యామిలీ ఎవరిదంటే?

image

ఆసియాలోనే టాప్-20 అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో 6 భారత్‌కు చెందినవేనని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ₹7.86L Cr సంపదతో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. 4,7,9,13,18 స్థానాల్లో వరుసగా మిస్త్రీ(₹3.25L Cr), జిందాల్(₹2.44L Cr), బిర్లా(₹1.99L Cr), బజాజ్(₹1.74L Cr), హిందూజా(₹1.32L Cr) కుటుంబాలు ఉన్నాయి. 2,3, స్థానాల్లో చీరావనోండ్-థాయ్‌లాండ్(₹3.70L Cr), హర్టోనో-ఇండోనేషియా(₹3.66L Cr) నిలిచాయి.

News February 13, 2025

APలో పెట్టుబడులు పెట్టండి.. తైవాన్‌కు మంత్రి లోకేశ్ ఆహ్వానం

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని తైవాన్‌ ప్రతినిధులను మంత్రి లోకేశ్ కోరారు. త్వరితగతిన అనుమతులు ఇప్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల్లో తైవాన్ అగ్రగామిగా ఉందని, APలోనూ ఆ రంగాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా AP అభివృద్ధి కోసం తీసుకొచ్చిన విధానాల్ని వివరించారు.

error: Content is protected !!