News February 9, 2025
ములుగు జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

ములుగు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.
Similar News
News February 18, 2026
నెల్లూరు: రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన బాధ్యతలు తీసుకునే వరకు ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
News February 18, 2026
2027లో అల్లు అర్జున్ నుంచి రెండు సినిమాలు?

అల్లు అర్జున్ వచ్చే ఏడాది 2 సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అట్లీ డైరెక్షన్‌లో చేస్తున్న AA22 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే లోకేశ్ కనగరాజ్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు మైత్రి సంస్థ తాజాగా ప్రకటించింది. AA, లోకేశ్ కలిసి తీసుకున్న సెల్ఫీని షేర్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు 2027లోనే రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News February 18, 2026
సంగారెడ్డి: కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడి సస్పెండ్

సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్న శంకర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినందున సస్పెండ్ చేసినట్లు చెప్పారు.


